Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీనుగాడి లవ్‌స్టోరి: నయనతారతో ఉదయనిధి రొమాన్స్.. పాటలు త్వరలో!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (15:49 IST)
‘ఓకె ఓకె’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌` నయనానందకరతార నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌’. తమిళంలో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
 
భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. పలువురు నిర్మాతలు ఈ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ కోసం పోటిపడినప్పటికీ` భారీ మొత్తాన్ని చెల్లించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రం రైట్స్‌ సొంతం చేసుకొన్నారు.‘పద్మశ్రీ’ పురస్కారగ్రహీత డా॥కె.సూర్యారావు సమర్పిస్తున్న ఈ చిత్రంలో సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, హైద్రాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్‌ అయిన డా॥భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంగీత సంచలనం హేరిస్‌ జైరాజ్‌ స్వరసారధ్యం వహించిన చిత్రానికి ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు. 
 
ఈ చిత్రం గురించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రం నయనతార ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. హేరిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలు తమిళంలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరుకు ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 
 
ఉదయనిధి స్టాలిన్‌, నయనతార, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, సమర్పణ: ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డా॥కె.సూర్యారావు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments