Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి సందడిలో 'గోపాల గోపాల' ఆడియో సాంగ్స్....

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (17:37 IST)
గత ఏడాది విడుదలైన 'రేసుగుర్రం', 'లెజెండ్', 'దృశ్యం' చిత్రాలు మంచి సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాల ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదలవడం ఓ విశేషం. 2015 ప్రారంభంలోని లహరి మ్యూజిక్ ద్వారా జనవరి 1న 'గుండె జారి గల్లంతయ్యిందే' కన్నడ వెర్షన్ ఖుషి ఖుషి యాగి అక్కడ విడుదలయ్యింది. ఆ చిత్రంలోని పాటలు ప్రస్తుతం కర్ణాటక అంతా మారుమోగుతున్నాయి.
 
అదేవిధంగా విక్టరీ వెంకటేష్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టారర్ 'గోపాల గోపాల' 4న ఆడియో విడుదలైంది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సెన్సేషనల్ హిట్ అయ్యింది. చిత్రంతోపాటు ఆడియో కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత   జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ "2014లో మా సంస్థ ద్వారా విడుదలైన 'రేసుగుర్రం', 'లెజెండ్' 'దృశ్యం' చిత్రాలు ఆడియో పరంగా మాకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. శుభసూచకంగా 2015 ప్రారంభం నుండే వరుసగా గుండెజారి గల్లంతయ్యిందే' కన్నడ వెర్షన్ ఖుషి ఖుషి యాగి, తెలుగులో  'గోపాల గోపాల' ఆడియో పరంగా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా వుంది.
 
ఇది ఓ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాను. గోపాల గోపాల మేము ఊహించిన దాని కంటే రికార్డు స్థాయిలో డిజిటల్ డౌన్‌లోడ్స్ అవుతున్నాయి. ఈ రోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడ చూసిన 'డోలు భాజే ...డోలు భాజే' సాంగ్ వినబడుతుంది. మొబైల్ ఫోన్స్‌లో రింగ్ టోన్ కూడా అదే. మిగతా పాటలు కూడా బాగున్నాయి అంటున్నారు. 2015 ఆడియో సేల్స్‌లో టాప్ పోజిషన్‌లో వుండటం మాకు ఆనందాన్ని కలుగచేస్తుంది.
 
మా సంస్థ మీద నమ్మకంతో ఈ ఆడియో హక్కులు మాకు ఇచ్చి ప్రోత్సహించిన సురేష్ బాబు, శరత్ మరార్‌లకు, 2014లో మంచి హిట్ చిత్రాలను అందించిన 14 రీల్స్ అధినేతలకు, కొర్రపాటి సాయి,  మరియు లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ అధినేతకు ధన్యవాదాలు అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments