Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ డాటర్ సారా బాలీవుడ్ అరంగేట్రం: షాహిద్ కపూర్‌తో జోడీ!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:47 IST)
భారతరత్న అవార్డు గ్రహీత, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ గారాల పట్టి సారా బాలీవు‌డ్‌ తెరంగేట్రం చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సారా తన తొలి సినిమాలో బాలీవుడ్ యువ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి నటించనుందనే వార్త బాలీవుడ్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
ముంబైలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 18 ఏళ్ల వయస్సున్న సారా, చూడటానికి అచ్చం సినిమా హీరోయిన్ లాగే కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు అంటున్నారు. 
 
తన తండ్రి మైదానంలో ఉంటే.. తల్లి, తమ్ముడితో కలిసి సారా అప్పుడప్పుడూ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేది. ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్‌లలోనూ ఆమె పలుమార్లు క్రికెట్ స్టేడియాల్లో కనిపించింది. ఇలా మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియంకు వచ్చిన సారాను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను సినిమాల్లోకి పంపాలని సచిన్ ముందు ప్రతిపాదించారట. అయితే సారాను సినిమాల్లోకి పంపేందుకు సచిన్ సుముఖంగా లేరని అతడి సన్నిహితులు అంటున్నారు. 
 
భార్య అంజలి లాగానే డాటర్‌ను వైద్యురాలిగానే చూడాలని సచిన్ భావిస్తున్నారు. అలాకాని పక్షంలో తన వ్యాపారాలన్ని ఆమె చేతిలో పెట్టేందుకూ సచిన్ నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. మరి సారా ఇష్టమేమిటో..!? తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుందో..? లేక తండ్రి పర్మిషన్‌తో సినిమాల్లో నటిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments