Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 9న అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్‌ల 's/o స‌త్య‌మూర్తి' విడుద‌ల‌

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (17:33 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 's/o స‌త్య‌మూర్తి సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఇటీవ‌లే దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించారు. ఈరోజు సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఎటువంటి క‌ట్స్ లేకుండా U/A స‌ర్టిఫికేట్ రావ‌టం విశేషం. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న's/o స‌త్య‌మూర్తి'  చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుంది.దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్ప‌టికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈరోజు సెన్నారు పూర్తిచేసుకుని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నాం. మాచిత్రానికి  U/A స‌ర్టిఫికేట్ ఎటువంటి క‌ట్స్ లేకుండా రావ‌టం సంతోషంగా వుంది.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్  మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుందని అన్నారు.
 
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు; సాంకేతిక వర్గం- పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను, ఆర్ట్ - రవీందర్, మ్యూజిక్  - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

Show comments