Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ తనయుడు ఆ పని కానించేశాడు....

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (19:46 IST)
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ 'ఇష్క్ వాలా లవ్' అనే మారఠీ చిత్రంలో వాళ్ల అమ్మ రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిన విషయమే. తెలుగులో కూడా విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని తన పాత్రకు అకీరా నందన్ డబ్బింగ్ పని పూర్తి చేసేశాడట. రేణు దేశాయ్ అకీరా నందన్ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ పేరును రేణు తెగ వాడుకుంటోందని ఇటీవల ప్రచారం జరుగుతోంది.
 
తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తున్నానంటూ సాగుతున్న ప్రచారంపై రేణు దేశాయ్ మండిపడింది. హీరో పవన్ కళ్యాణ్తో విడిపోయినా... అతని పేరు ఉపయోగించుకోవటంపై వస్తున్న మెసేజ్లపై ఆమె తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ను పెళ్లాడక ముందు తాను ఫేమస్ మోడల్, నటి అనే విషయాన్ని గుర్తు చేసింది. 'పవన్ గారు ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ' అన్న ఆమె గత ఏడాది ఏ ఒక్కరి సాయం, మద్దతు లేకుండా ఓ హిట్ సినిమా తీశానని తెలిపింది. ఇకనైనా ఈ విషయంలో అతిగా ఆలోచించే బుర్రలు ఇకనైనా ఆపాలని సూచించింది. ఆ ఎనర్జీని ఏదైనా సోషల్ వర్క్కు ఉపయోగిస్తే మంచిదని రేణు సలహా కూడా ఇచ్చింది.
 
గతంలో కూడా రేణు దేశాయ్కి పవన్ అభిమానులు ఆమెను అవమానించే విధంగా మెసేజ్లు పోస్ట్ చేశారు. ఆ మెసేజ్లపై స్పందించిన ఆమె తన ఫేస్బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది. 'ఇలాంటి మెసేజ్లు పంపించడం సరికాదు. ఇది పవన్కి కూడా నచ్చదు. నేను ఈ రోజు నుంచి నా ఇన్ బ్యాక్స్ ఆప్షన్ని స్విచ్ఛాప్ చేస్తున్నాను. సెలబ్రెటీస్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారిని ఈ విధంగా వేధించడం తగదు. పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ, మిగతా వారి ఇబ్బందులను కూడా ఆలోచించాలి' అని పేర్కొంది.
 
కాగా, అకిరా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించిన రేణు దేశాయ్ నిర్మాతగా మారి మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా రేణు దేశాయ్ నిర్మించిన 'మంగలాష్ తక్ వన్స్ మోర్'  సినిమా విజయం సాధించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments