Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ : రేణు దేశాయ్

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (07:31 IST)
తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ పేరును వాడుకుని ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తున్నానంటూ సాగుతున్న ప్రచారంపై రేణు దేశాయ్ మండిపడింది. హీరో పవన్ కళ్యాణ్తో విడిపోయినా... అతని పేరు ఉపయోగించుకోవటంపై వస్తున్న మెసేజ్లపై ఆమె తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ను పెళ్లాడక ముందు తాను ఫేమస్ మోడల్, నటి అనే విషయాన్ని గుర్తు చేసింది. 'పవన్ గారు ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ' అన్న ఆమె గత ఏడాది ఏ ఒక్కరి సాయం, మద్దతు లేకుండా ఓ హిట్ సినిమా తీశానని తెలిపింది. ఇకనైనా ఈ విషయంలో అతిగా ఆలోచించే బుర్రలు ఇకనైనా ఆపాలని సూచించింది. ఆ ఎనర్జీని ఏదైనా సోషల్ వర్క్కు ఉపయోగిస్తే మంచిదని రేణు సలహా కూడా ఇచ్చింది.
 
గతంలో కూడా రేణు దేశాయ్కి పవన్ అభిమానులు ఆమెను అవమానించే విధంగా మెసేజ్లు పోస్ట్ చేశారు. ఆ మెసేజ్లపై స్పందించిన ఆమె తన ఫేస్బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది. 'ఇలాంటి మెసేజ్లు పంపించడం సరికాదు. ఇది పవన్కి కూడా నచ్చదు. నేను ఈ రోజు నుంచి నా ఇన్ బ్యాక్స్ ఆప్షన్ని స్విచ్ఛాప్ చేస్తున్నాను. సెలబ్రెటీస్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారిని ఈ విధంగా వేధించడం తగదు. పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ, మిగతా వారి ఇబ్బందులను కూడా ఆలోచించాలి' అని పేర్కొంది.
 
కాగా, అకిరా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించిన రేణు దేశాయ్ నిర్మాతగా మారి మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా రేణు దేశాయ్ నిర్మించిన 'మంగలాష్ తక్ వన్స్ మోర్'  సినిమా విజయం సాధించింది.  

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments