Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజున రేణూ దేశాయ్ చిత్ర టీజర్ రిలీజ్!

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (15:06 IST)
తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఓ గిఫ్ట్ ఇవ్వనుంది. హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ రెండో తేదీన తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన "ఇష్క్‌వాలా లవ్" అనే చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని రేణూ దేశాయ్ నిర్ణయించుకున్నారు. నాకు జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన అది. ఇష్క్ వాలా లవ్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 2వ తేదీ 2014న విడుదల చేస్తున్నాం అని ట్విట్టర్‌‍‌లో ఓ సందేశాన్ని పెట్టారు. అంటే పవన్‌కు తాను ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్ ఇదేనని ఆమె చెప్పకనే చెప్పారు.
 
పవన్ జన్మదినం రోజైన సెప్టెంబర్ 2వ తేదీన తాను రూపొందించిన ఇష్క్ వాలా లవ్ అనే చిత్ర టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు రేణూ దేశాయ్ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా, ఇటీవల విడుదల చేసిన ఇష్క్ వాలా లవ్ చిత్ర ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన వచ్చిన విషయం తెల్సిందే. అభిమానులు అందించిన ఉత్సాహంతో సెప్టెంబర్ 2 తేదీన థియేటర్ ట్రైలర్ విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments