Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతూ అగర్వాల్‌పై రెడ్ స్మగ్లింగ్ కేసు... అరెస్టుకు రంగం సిద్ధం..!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:20 IST)
రెడ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడైన టాలీవుడ్ నిర్మాత మస్తాన్ అలీ ప్రేయసి హీరోయిన్ నీతూ అగర్వాల్‌కు సంబంధం ఉన్నటు తేలింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలితంగా ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి. 
 
శేషాచలం ఎన్‌కౌంటర్ తర్వాత ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసు ఉక్కుపాదం మోపడమే కాకుండా, ఈ స్మగ్లింగ్‌లో సంబంధం ఉన్న వ్యక్తుల కూపీ లాగుతున్నారు. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే సినీ నటి రీతూ అగర్వాల్ పైన కర్నూలు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది. 
 
స్మగ్లింగ్‌లో ఆరితేరిన మస్తాన్ వలీ ఎర్ర చందనంలో కోట్లాది రూపాయలు సంపాదించి ఆ సొమ్ముతో సినిమా తీశాడు. ఆ తర్వాత అదే హీరోయిన్‌తో సహజీవనం చేశాడు. మస్తాన్ వలీ 2013లో ప్రేమ ప్రయాణం అనే సినిమా తీశాడు. అందులో హీరోయిన్‌గా నటించిన రీతూ అగర్వాల్‌తో సహజీవనం ప్రారంభించాడు. అనంతరం ఆమెను మూడో పెళ్లి చేసుకున్నాడు. 
 
రీతూ ఆగర్వాల్‌కు మస్తాన్ వలీ రూ.35 లక్షల విలువైన ఓ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ - నీతూ అగర్వాల్ అకౌంట్ల మధ్య ఆర్థిక లావాదేవలు జరిగినట్లుగా వెల్లడైంది. ఇప్పటికే మస్తాన్ వలీ, ఆయన సోదరుడు ఎర్రచందనం కేసులో అరెస్టయ్యారు. రీతూ అగర్వాల్ పైన రుద్రవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె దొరికితే మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఆమె ముంబై లేదా బెంగళూరులలో ఉండవచ్చొని భావించి ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. 
 
మరోవైపు.. నీతు బ్యాంకు ఖాతాల నుండి మస్తాన్ వలీ ఇతర స్మగ్లర్లకు నిధులు బదలీ చేసినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలిందని తెలుస్తోంది. దీంతో ఆమె బ్యాంకు ఖాతాల పైన నిఘా పెట్టగా ఆ ఖాతాలో నగదు నిల్వ లేనట్లు గుర్తించారని సమాచారం. మస్తాన్ వలీ అనుచరుడు శంకర్ నాయక్‌కు నీతూ అగర్వాల్ ఖాతా నుండి నగదు బదలీ చేసినట్లుగా గుర్తించారు. ఎర్రచందనం కేసులో వీరితో పాటు చెన్నై సినీ నిర్మాతలు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments