Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్ క్రీమ్ 2.... యాక్... పట్టపగలు, శ్రీదేవి ఏమవుతాయో...?!!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (16:39 IST)
రాంగోపాల్‌ వర్మ సినిమాలంటే ఆసక్తి ప్రేక్షకులకు వుండేది. సినిమాసినిమాకు ఏదో కొత్త టెక్నాలజీ అని పేరు చెప్పి అమ్మేస్తుండేవాడు. జనాలు చూస్తారు అని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యేవారు. వర్మ పేరును క్యాష్‌ చేసుకునేందుకు నిర్మాతలు వున్నారు. పెద్ద చిత్రాలు తీసిన నిర్మాతలు ఆయనతో తీయకపోవడంతో ఏవో చిన్న చిత్రాలు తీసే రామసత్యనారాయణను తీసుకున్నాడు. ఆయనతో తీసిన ఐస్‌క్రీమ్‌ చిత్రం ఏదో కొత్త టెక్నాలజీ అని చూడ్డానికి అప్పట్లో జనాలు వచ్చారు. 
 
చాలా సింపుల్‌గా లోబడ్జెట్‌ సినిమాను తీసి డబ్బులు బాగా సంపాదించుకున్నాడు. సినిమా చూశాక.. ఇందులో ఏమీలేదని పెదవివి విరిచారు. అప్పటికే లాభాలు వచ్చేశాయి. ఇప్పుడు రెండో భాగం తెరపైకి తెచ్చాడు. అయితే ఈ నెల 21న సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమా పరమచెత్తగా వుందనే టాక్‌ రావడంతో... ఓపెనింగ్స్‌ లేవు. నిర్మాత అన్ని అమ్మేసుకున్నాడు. లాభపడింది నిర్మాతే. 
 
ఓపెనింగ్స్‌ థియేటర్ల దగ్గర లేవు. దాంతో కొన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సినిమాలు ఇక కొనకూడదని సోమవారంనాడు డిస్ట్రిబ్యూటర్ల ఏర్పాటు చేసుకున్న సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా పట్టపగలు, శ్రీదేవి.. అంటూ రెండు సినిమాలు వర్మ నుంచి విడుదల కావాల్సి వున్నాయి. వాటిపై ఈ ఎఫెక్ట్‌ పడుతుందని తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments