Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మకు వీరప్పన్ చిక్కాడు... ''కిల్లింగ్ వీరప్పన్‌''గా సందీప్ భరద్వాజ్‌..

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (12:05 IST)
ఇటీవల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వర్మ ఈ సినిమాను ప్రకటించనప్పటి నుంచి వీరప్పన్‌గా నటించేది ఎవరన్న ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. 
 
వీరప్పన్ పాత్రకు జీవం పోసే నటుడి కోసం వర్మ చాలా చోట్ల గాలించాడు. చివరికి ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్‌ను వర్మ ఎంపిక చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన సందీప్‌లో వీరప్పన్ పోలికలో మెండుగా ఉన్నాయి. కాగా, వీరప్పన్‌ను హతమార్చే పోలీసాఫీసర్ పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. గతంలో కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఆ కసీతో ఉన్న రాజ్‌కుమార్ కుమారుడే ప్రస్తుతం వర్మ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటించనున్న శివరాజ్ కుమార్ కావడం విశేషం. 
 
కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే వీరప్పన్‌ను వర్మ విలన్‌గా చిత్రీకరించనుండడంతో తమిళనాట ఒక వర్గం నుంచి ఈ చిత్రానికి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పరిస్థితులు ఎలా మారుతాయో చిత్రం విడుదల అయితే కానీ తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments