Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పది జన్మలెత్తినా ఆయనకు సాటి రాలేను'.. వర్మ కామెంట్స్‌కు దుల్కర్ ట్వీట్..!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:02 IST)
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మలయాళ నటుడు మమ్ముట్టిపై చేసి కామెంట్స్‌కు ఆయన కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ స్పందించారు. ఎన్ని జన్మలెత్తినా తన తండ్రి నటనకు సాటి రాలేనంటూ ట్వీట్స్ చేశారు. అసలు విషయానికి వస్తే... మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిపై రాంగోపాల్ వర్మ బుధవారం తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మమ్ముట్టి కంటే ఆయన కొడుకే బెటర్ అంటూ ట్వీట్ చేశారు. 
 
మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం' చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ సినిమాలో దుల్కర్‌ను చూసి మమ్ముట్టి నటన నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. దుల్కర్‌కు, మమ్ముట్టికి చాలా అంతరం ఉందని, కొడుకుతో పోల్చితే మమ్ముట్టిని ఓ జూనియర్ ఆర్టిస్టుగానే భావించాల్సి ఉంటుందని విమర్శించారు. 
 
ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న మమ్ముట్టి కేరళ గర్వపడేలా చేయలేకపోయారని, దుల్కర్ కొద్ది కాలంలో ఆ పని చేయగలడని అభిప్రాయపడ్డారు. అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా, మమ్ముట్టికి ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకుని, వాటిని దుల్కర్‌కు ఇస్తారని సెలవిచ్చాడు.
 
అందుకు దుల్కర్ సల్మాన్ తాజాగా స్పందిస్తూ ''ఇంకా పది జన్మలు ఎత్తినా.. ఎంత సాధించినా నా తండ్రి నటనా సామర్థ్యం ముందు మిలియన్‌లో ఒక్క శాతం కూడా నేను సాటిగా రాలేను'' అంటూ రామ్ గోపాల్ వర్మ పేరు ప్రస్తావించకుండా బదులు ఇచ్చాడు. ఇలా చాకచక్యంగా బదులు ఇవ్వడంపై దుల్కర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments