Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెయిల్యూర్ ఆర్టిస్టులే పెట్టుబడిగా వర్మ 'ఎటాక్‌'

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (15:16 IST)
ఇండస్ట్రీకి దూరంగా వుండి, కెరీర్‌లో ఫెయిల్‌ ఆర్టిస్టులుగా వున్న వారిని ఒక్కసారిగా వర్మ తెరపైకి తెస్తున్నారు. చిత్రమేమంటే... తెలుగు సినిమాలు అస్సలు చేయను అని ముంబై వెళ్ళి వెనక్కు వచ్చిన రాంగోపాల్‌ వర్మ... అదే రేంజ్‌లో ఇకపై తాను సినిమాలు చేయను.. అంటూ ఫెయిల్యూర్స్ వరసగా వస్తున్నప్పటికీ వడ్డే నవీన్‌తో కలిసి పనిచేయడం. మరోవైపు... మంజుభార్గవి... చక్కటి డాన్సర్‌గా పేరుపొందిన ఆమెకు విశ్వనాథ్‌ చిత్రాల తర్వాత కొన్ని చిత్రాల్లో చేసినా సరైన పాత్రలు రాక దూరంగా వుంటానని స్టేట్‌మెంట్‌ ఇచ్చిన ఆమెతో కలిసి సినిమా చేయడం విశేషం.

 
అత్యంత తక్కువ ఖర్చుతో జీరో సైజ్‌ లేదా లో-బడ్జెట్‌ సినిమాలూ తీయగలరు. 'అతివృష్టి అనావృష్టి' మాదిరి అన్నమాట. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్లీ తనదైన ట్రెండ్‌ సెట్టింగ్‌ స్టైల్‌లోకి వచ్చేశారు.
 
'ఎటాక్‌' అనే వర్కింగ్‌ టైటిల్‌తో.. హై ఇంటెన్సిటీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న తన తాజా చిత్రంలోని ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతవరకూ ఎవరూ షూట్‌ చేయని విధంగా.. హైద్రాబాద్‌ ఓల్డ్‌ సిటీ పురానాపూల్‌ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్‌ ఎపిసోడ్‌ను రెయిన్‌ ఎఫెక్ట్‌లో తియ్యబోతున్నారు దర్శక సంచలనం రాంగోపాల్‌ వర్మ. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 27 ఉదయం నుంచి జరుగుతోంది. హైద్రాబాద్‌ ధూల్‌పేట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రంలోని కొంతమంది నటీనటుల లుక్స్‌ని రిలీజ్‌ చేశారు రాంగోపాల్‌ వర్మ. సి.కళ్యాణ్‌ నిర్మాణంలో షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments