Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ పాడవుల్లా మా ప్యానల్‌లో ఐదుగురమే దిగాం: రాజేంద్రప్రసాద్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:38 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ విజేతగా నిలిచారు. నువ్వా... నేనా... అన్న రీతిలో సాగిన ‘మా’ ఎన్నికల్లో 85 ఓట్ల తేడాతో జయసుధను ఓడించారు. రాజేంద్రప్రసాద్‌ గెలుపుతో ఆయన అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఇది సంచలన గెలుపు అని, న్యాయం గెలిసిందని నాగబాబు అన్నారు. ఇది జయసుధ ఓటమి కాదని మురళీమోహన్‌ ఓటమి అని విజయ్‌చందర్‌ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఇది సేవా కార్యక్రమమని, ఇందులోనుంచి ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయబోమని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతామని నటకిరీటి స్పష్టం చేశారు. పంచ పాండవుల్లా మా ప్యానల్‌లో ఐదుగురమే ఉన్నామని, మా ఎన్నికల్లో తుచ్చ రాజకీయాలు తీసుకువచ్చారని, మాకు మద్దతు ఇచ్చిన వారందరినీ బెదిరించారని, ప్రలోభపెట్టారని, వాటన్నిటిని తట్టుకుని... మీ మనసుల్లో నిలిచామని, మీ అందరికి సేవ చేయడానికే వచ్చామని ఆయన అన్నారు. 
 
నేను ఒంటరివాడని, వీడు అభిమన్యుడులా వేసేస్తామని అనుకున్నారని... కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటుంది. ఏమిటంటే నేను నటకిరీటిని అంటే అర్జునుడిని... ఆ విషయం ఇప్పుడు తెలుసుకుని ఉంటారు అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఈ సమయంలో నన్ను వెన్ను తట్టి, నా వెనుక ఉండి... నన్ను నడిపించిన ఒకే ఒక వ్యక్తి నాగబాబు అని ఆయన అన్నారు. ఏదీ ఏమైనా నేను ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతానని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. మీ అందరికి సేవచేసే అవకాశం ‘మా’ మెంబర్లు నాకు కల్పించారని, నా విజయాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరికి రాజేంద్రప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments