Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం గ్యాంగ్ ప్రీమియర్ షోకు చిరంజీవిని ఆహ్వానించిన రాజశేఖర్!

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (11:33 IST)
మెగాస్టార్ చిరంజీవి.. డాక్టర్ రాజశేఖర్‌ల మధ్య గొడవలు సర్దుమణిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనస్పర్దలు తొలగిపోయాయనే విషయాన్ని స్వయంగా రాజశేఖర్ తెలియజేశారు. అంతేకాకుండా చిరంజీవికి తన తాజా చిత్రం గడ్డం గ్యాంగ్ స్పెషల్ షో వేస్తానని అన్నారు. 
 
ఇందుకోసం చిరంజీవి ఆహ్వానించినట్లు చెప్పారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు రాజశేఖర్ మాట్లాడుతూ... " నేను చిరంజీవి గారిని గడ్డం గ్యాంగ్ ప్రీమియర్ షో కు పిలుస్తున్నా. అలాగే మిగతా హీరోలను కూడా ఆహ్వానిస్తున్నా. ఇక చిరంజీవికి ఆసక్తి ఉంటే.. ఆయన కు స్పెషల్ షో వేస్తాను," అని తెలియచేసారు. 
 
రాజశేఖర్ నటించిన గడ్డం గండ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం పై రాజశేఖర్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రీసెంట్‌గా రాజశేఖర్ ఇచ్చిన ఓ ప్రెస్ మీట్‌లో చిరంజీవి తనకు మధ్య ఉన్న మనస్పర్దలు చెరిగిపోయాయని, ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంలో నాగబాబు కీలక పాత్ర పోషించాడని కూడా తెలిపాడు. 
 
అలాగే త్వరలోనే రాజశేఖర్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఇంట్లో జరగబోయే ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. డా.రాజశేఖర్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్‌'. షీనా హీరోయిన్. పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని, శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవితారాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments