Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ హీరో.. కమల్ విలన్..! శంకర్ డైరెక్షన్‌లో కొత్త చిత్రం..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (18:29 IST)
అవును. మీరు చదువుతున్న టైటిల్ కరెక్టే. బ్రహ్మాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా రానుందట. అందులో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో అయితే కమల్ హాసన్ వలన్‌గా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా హల్‌చల్ చేస్తోంది.
 
కోలీవుడ్‌ బిగ్ హీరోలు సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హసన్. వీరిద్దరూ దాదాపు ఒకేసారి సినీ కెరీర్ ప్రారంభించారు. అంతేకాదు తెరపై కూడా ఒకే సారి స్టార్లుగా ఎదిగారు. మొదట్లో ఇద్దరు కలసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అనంతరం ఏర్పడిన వ్యక్తిగత ఇమేజ్‌లతో మళ్ళీ కలసి నటించలేదు. గత 36 ఏళ్ల క్రితం వచ్చిన 'నినైత్తాల్ ఇనిక్కుం' సినిమాలో చివరిగా వీరిద్దరూ కలసి నటించారు.
 
అయితే ఆ తర్వాత ఎన్నో సార్లు వీరిద్దరిని కలిపి సినిమా తీయాలను పలువురు దర్శక నిర్మాతలు విఫలయత్నం చేశారు. ఇన్నేళ్ల తర్వాత వారు కలిసి నటించే అవకాశం కనిపిస్తోందనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఇటీవల లింగ సినిమాతో పడరాని పాట్లు పడిన రజనీకాంత్, తనకు కమర్షియల్ సినిమా చేసిపెట్టమని దర్శకుడు శంకర్‌ని అడిగారట. 
 
వెంటనే ఆయనో కథ వినిపించాడట. అందులో హీరో పాత్రకి సరితూగే విలన్ పాత్ర ఉంది. ఆ విలన్ పాత్రని కమల్ తో చేయిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో కమల్‌ని సంప్రదించారట. ఆయన కూడా ఓకే అన్నాడని సమాచారం. మరి వీరి సన్నాహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments