Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్ధమవుతున్న ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (12:23 IST)
‘అలా ఎలా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న హీరో రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. రేష్మి మీనన్, జియా నాయికలు. ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై పద్మజ.ఎస్ సమర్పణలో ఎస్.ఎన్.డ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటూ.. విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘హైదరాబాద్ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. రొమాన్స్, ఎమోషన్స్, ఫాంటసీ అంశాల కలయికలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. 
 
నిర్మాత ఎస్.ఎన్.డ్డి మాట్లాడుతూ ‘వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేశాం. వాటికి చక్కని స్పందన వస్తోంది. సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. 
 
ఇందులో రావు రమేష్, తాగుబోతు రమేష్, అంబటి, చంటి, రమాప్రభ, మధుమణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: బీవీ అమర్‌నాథ్ రెడ్డి, ఎడిటర్:ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ.ఎస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, రచన-దర్శకత్వం: రాజ్‌సత్య.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments