Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో ''టుడే''

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (21:52 IST)
లెజెండ్‌, లయన్‌ చిత్రాల కథానాయకి రాధికా ఆఫ్టే, 'రంగం'ఫేం అజ్మల్‌ హీరో హీరోయిన్‌గా తమిళంలో సంచలన విజయం సాధించిన ఓ చిత్రాన్ని, ఏకవీర, వేటాడు వెంటాడు వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీనివాస్‌ దామెర ఈ చిత్రాన్ని ఫైవ్‌స్టార్‌ మల్టీమీడియా సమర్పణలో ఆల్‌ఫైన్‌ సినిమా బేనర్‌పై  తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం  ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర చిత్ర విశేషాలను తెలుపుతూ.. వైద్యరంగంలో జరుగుతున్న కొన్ని యదార్ధ సంఘటనల ప్రతిరూపమే ఈ టుడే సినిమా.
 
కార్పోరేట్‌ హాస్పిటల్స్‌లలో జరుగుతున్న అనేక సమస్యల గురించి విశ్లేషిస్తూ తీసిన చిత్రమిది. ఈమధ్య హాస్పటల్స్‌లో జరుగుతున్న నిర్లక్ష్య ధోరణే కాదు, ఎక్స్‌పేర్‌ డేటేడ్‌ మెడిసిన్స్‌ కూడా విక్రయించడం లాంటి అతి ఘోరమైన సంఘటనలను చూస్తూ వున్నాం. ఇలాంటివే కాకుండా ఇంతకుమించి కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లలో జరిగే మెడికల్‌ మాఫియాకు పాల్పడే సంఘ విద్రోహులను బయటపెట్టే చిత్రం టుడే.. కొన్ని సంచలన సంఘటనలతో ఈ మధ్య మీడియాలో హాట్‌ టాపిక్‌ అయిన రాధికా ఆప్టే ఈ చిత్రంలో లాయర్‌గా ప్రధాన పాత్రలో నటించింది. అజ్మల్‌ ఇందులో డిఫరెంట్‌ పాత్రతో మరోసారి ప్రేక్షకులకు దగ్గర కానున్నాడు. 
 
మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన అద్భుతమైన 4 పాటలను ప్రముఖ గేయ రచయిత కందికొండ చక్కటి సాహిత్యానందించారు. అందమైన లోకేషన్‌లలో ఈ పాటలను చిత్రీకరించడం జరిగింది. పదునైన సంభాషణలతో వసంతమూర్తి రాసిన మాటలు చిత్రంలో హైలైట్‌. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ చిత్రం రూపొందించబడింది. అన్ని కార్యక్రమాలు ముగించి మే ప్రధమార్ధంలోనే విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తున్నామని అన్నారు. రాధికా ఆప్టే, అజ్మల్‌, గాయకుడు మనో ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు ; వసంత మూర్తి, పాటలు ; కందికొండ, సంగీతం ; మణిశర్మ, దర్శకత్వం ; రుద్రన్‌, నిర్మాత ; శ్రీనివాస్‌ దామెర.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments