Webdunia - Bharat's app for daily news and videos

Install App

రభస దర్శకుడి సెంటిమెంట్‌.... రెండు చిత్రాలు అంతే...

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (20:01 IST)
రభస దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌... గతంలో 'కందిరీగ' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్‌ నిర్మించాడు. అప్పట్లో తెలంగాణ వుద్యమం ఒకవైపు, మరోవైపు ఫైనాన్షియర్ల ఇబ్బందులవల్ల సినిమా చాలాకాలం ఆలస్యమైంది. విడుదలకు ముందే కొద్దిపాటి గొడవల్తో విడుదలైంది. అప్పటికే ఫైనాన్స్‌ వడ్డీ రూపంలో ఎక్కువ కావడంతో... సినిమా రిలీజ్‌ అయి హిట్‌ అయినా.. పెద్దగా లాభం కన్పించలేదు. కానీ హిట్‌ చిత్రంగా పేరువచ్చింది. 
 
ఇప్పుడు 'రభస' విషయానికి వస్తే.. ఇంచుమించు కొన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. రభస సినిమా షూటింగ్‌లో వుండగా.. కథను కొద్దిగా మర్చాల్సి రావడంతో కొద్దిరోజులు వాయిదాపడింది.  దర్శకుడుకి కామెర్లు రావడంతో రెండు నెలలు గ్యాప్‌ వచ్చింది. ఈలోగా నటీనటులు డేట్స్‌ దొరక్క చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. 
 
ఇక చివరగా సినిమా రిలీజ్‌కు వచ్చేసరికి... సెట్‌ తాలూకా రావాల్సిన మొత్తం 58 లక్షలు ఇవ్వాలని మంచు ఫ్యామిలీ బెల్లంకొండ సురేష్‌ ఇంటిపై రచ్చ చేసింది. ఇలా సంతోష్‌ శ్రీనివాస్‌ చేసిన రెండు చిత్రాలూ ఏదోరకంగా గొడవ సెంటిమెంట్‌తోనే సాగుతున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments