Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 12న ఛార్మి-పూరి జగన్నాథ్‌ల 'జ్యోతిలక్ష్మీ'

Webdunia
గురువారం, 28 మే 2015 (21:08 IST)
ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఛార్మి హీరోయిన్‌గా 'జ్యోతిలక్ష్మీ' పేరుతో సినిమా చెయ్యబోతున్నామని దర్శకనిర్మాతలు ఎనౌన్స్‌ చెయ్యడంతోనే ఈ సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అయింది. ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేశారో ఆడియన్స్‌లో అప్పటివరకు వున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ రెట్టింపయ్యాయి. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. 
 
ఈమధ్య కాలంలో ఎక్కువ క్రేజ్‌ వున్న సినిమాగా 'జ్యోతిలక్ష్మీ' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌ 12న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ- ''మా 'జ్యోతిలక్ష్మీ' చిత్రాన్ని జూన్‌ 12న విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది.
 
బిజినెస్‌ పరంగా కూడా మేం చాలా హ్యాపీగా వున్నాం. అన్ని ఏరియాల నుంచి చాలా మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ అద్భుతమైన సంగీతాన్నందించారు. జూన్‌ 4న ఈ చిత్రం ఆడియోను చాలా డిఫరెంట్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌గారు చాలా వండర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఆయన కెరీర్‌లో తప్పకుండా ఈ సినిమా ఒక డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ అవుతుంది. అలాగే ఛార్మి ఇప్పటివరకు చెయ్యని ఒక ఛాలెంజింగ్‌ రోల్‌ ఈ సినిమాలో చేసింది. ఛార్మి కెరీర్‌లో 'జ్యోతిలక్ష్మీ' అనే సినిమా ఒక మరపురాని చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది'' అన్నారు. 
 
ఛార్మి, సత్య, వంశీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కెమెరా: పి.జి.విందా, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments