Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డ్‌ సృష్టించిన విజయ్‌ 'పులి' టీజర్‌: ఒక్క రోజులోనే 20 లక్షల హిట్స్.. (Video)

Webdunia
బుధవారం, 24 జూన్ 2015 (11:55 IST)
'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న 'పులి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే సంద్భంగా రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ''మా 'పులి' చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. పి.కె. చిత్రాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం టీజర్‌కి హిట్స్‌ రావడం ఆనందంగా వుంది. ఈ టీజర్‌ని చూసి విజయ్‌ తమకు అందించిన బర్త్‌డే గిఫ్ట్‌గా ఫీల్‌ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. 'పులి' చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.
 
విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, ఆలిండియా స్టార్‌ శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments