Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా... పవర్ స్టార్ అసందర్భ ప్రకటన....

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (14:58 IST)
ఈ ప్రకటన చేసింది టాలీవుడ్ పవర్ స్టార్ అనుకునేరు. కోలీవుడ్ పవర్ స్టార్. అతడి పేరు శ్రీనివాసన్. తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే తనకు తానే బిరుదు ఇచ్చేసుకున్నాడు. వృత్తిరీత్యా వైద్యుడయిన ఈ శ్రీనివాసన్ దానిని ప్రక్కనపెట్టి సినీ ఇండస్ట్రీలో యాక్టర్ అవతారమెత్తడమే కాకుండా నేను కోలీవుడ్ పవర్ స్టార్ ను అంటూ బిరుదు కూడా ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఇతడి విషయం ఏంటయా అంటే.... 2016 సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.
 
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ పవర్ స్టార్ వెల్లడించారు. ఎప్పుడు కూడా ఈయనను ఎవరూ అడగక మునుపే తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పేస్తుంటారు. ఇపుడు కూడా అలాగే తాను 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి చర్చకు తావిచ్చాడు. 
 
అంతేకాదండోయ్... తనకు రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది అభిమానులు ఉన్నారని అంటున్నాడు. సినిమాల్లో తనకు రజినీకాంత్ మాత్రమే పోటీ అని చెప్పే పవర్ స్టార్ రాజకీయాల్లో మాత్రం తనకు సాటి ఎవరూ లేరని ప్రకటించుకున్నాడు. అన్నట్లు ఈ పవర్ స్టార్ శంకర్ ఐ చిత్రంలో నటించాడట. మరి ఈ చిత్రంతో దశ తిరుగుతుందేమో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments