Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుబోతు పాత్రల పేటెంట్ ఎంఎస్ నారాయణ!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (14:26 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు ఎంఎస్ నారాయణ హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు ఆయనలాంటి మరో నటుడు దొరకడం చాలా అరుదని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే అంటారు తాగుబోతు పాత్రల పేటెంట్ ఎంఎస్ నారాయణ అని. ముఖ్యంగా ఆయన అతి తక్కువ కాలంలోనే చిరస్మరణీయమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 
 
ప్రధానంగా తెలుగు సినిమాల్లో పేరడీలతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఏ సినీ హీరో పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఎంఎస్, తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 'దూకుడు' సినిమాలో పలువురు అగ్రహీరోల పేరడీలతో రూపొందించిన సీన్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఆ సీన్‌లో ఎంఎస్ విభిన్న రీతుల్లో కనిపించి, సదరు పాత్రల రియల్ హీరోలను మరిపించడమే కాక, హాస్యాన్ని పండించారు. 
 
తెలుగు చిత్రసీమలోని దాదాపుగా హీరోలందరి పేరడీల్లోనూ ఎంఎస్ కనువిందు చేశారు. అంతేకాకుండా పలువురు బాలీవుడ్ హీరోలతో పాటు రాజకీయ నాయకుల రూపాల్లో వేషాలు వేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా.. ఢిల్లీ రాజకీయ సంచలనం అరవింద్ కేజ్రీవాల్ రూపంలో కనిపించిన ఎంఎస్, ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఇక మందుబాబు పాత్ర ఎంఎస్‌కు బ్రాండ్ ఇమేజ్‌గా మారిందనే చెప్పొచ్చు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments