Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ మార్పులు కోరుకోలేదు.. గోపాల గోపాల ఫస్ట్ లుక్‌ రెడీ

Webdunia
శనివారం, 26 జులై 2014 (12:59 IST)
‘అత్తారింటికి దారేది’ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హిందీలో పరేశ్‌రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఈ క్రేజీ మల్టీస్టారర్‌కి స్క్రిప్టే ప్రధాన బలం’ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే... మీడియాలో మాత్రం ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి.
 
పాత్ర పరంగా, తన ఆహార్యం పరంగా దర్శకుడు డాలీకి పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారని, అందుకు ఆయన అంగీకరించకపోవడంతో పవన్ బాధపడ్డాడని ఏవేవో గాసిప్స్ వచ్చాయి. అందుకే పవన్ షూటింగ్‌లో కూడా పాల్గొనట్లేదని టాక్ వచ్చింది. అయితే ఈ గాసిప్స్‌ను యూనిట్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. 
 
పవన్ ఈ సినిమా స్క్రిప్టులో ఎలాంటి మార్పులూ కోరుకోలేదనీ, ‘గోపాల గోపాల’ విషయంలో ఆయన పూర్తి సంతృప్తితో ఉన్నారనీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి ఎంత ఉంటుందో పవన్ కల్యాణ్ పాత్ర నిడివి కూడా అంతే ఉంటుందన్నారు. షూటింగ్ మొదలైన తర్వాత కూడా సెట్స్‌కి రావడానికి పవన్ ఇంత టైమ్ తీసుకోవడానికి... దానికి కారణం కేవలం ఆయన వెన్నునొప్పే అని తెలిసింది. కొన్ని రోజులుగా ఆయన వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు.
 
ఈ కారణంగానే... తన మాజీ భార్య రేణూ దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ ఆడియో వేడుకకు కూడా అతిథిగా వెళ్లలేకపోయారు పవన్. వెన్నునొప్పి కాస్త తగ్గడంతో ఇప్పుడు ‘గోపాల గోపాల’ షూటింగ్‌లో హుషారుగా పాల్గొంటున్నారని తెలిసింది. ఇంకా గోకులాష్టమికి గోపాల గోపాల ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దీనిపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments