Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ పవన్ నాతో సినిమా చేస్తున్నారు.. రామ్ చరణ్!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (17:11 IST)
మెగా ఫ్యాన్స్‌కు పండగే పండగ. మెగాస్టార్ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాల నేపథ్యంలో మెగా తనయుడు రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని పవన్ కార్యాలయం అధికారికంగా వెల్లడించగా, ఇపుడు రామ్ చరణ్ కూడా ధృవీకరించారు. 
 
పవన్‌ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించే తొలి చిత్రం ఇదే. తర్వాత పవన్ వరుసగా యంగ్ హీరోలు, డైరెక్టర్లతో వరుసగా సినిమాలు నిర్మించే యోచనలో ఉన్నారు. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఇకపై వరుసగా తెలుగుతో పాటు హైదరాబాదీ, దక్కన్ లాంటి ఉప ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా చిత్రాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే బాబాయ్ నిర్మించే సినిమాలో నటిస్తున్నట్టు చెర్రీ కూడా తన సన్నిహితుల వద్ద కన్‌ఫార్మ్ చేశాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న రామ్ చరణ్.. అది పూర్తయిన వెంటనే పవన్ నిర్మించే సినిమాలో నటించే అవకాశం ఉంది. అయితే నిన్నటి వరకు చెర్రీ కూడా బాబాయ్‌తో అంతంత మాత్రంగానే ఉండేవాడని వార్తలు లీక్ అయ్యేవి. ఇప్పుడు సడన్‌గా వీరిద్దరి కలయికలో సినిమా ఏమిటా అన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments