Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవదూషణ కేసులో వీణా మాలిక్‌కు 26 యేళ్ల జైలు... పాకిస్థాన్ నటి స్పందన!

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (15:59 IST)
పాకిస్థాన్‌కు చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్‌కు పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు 26యేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.13 లక్షల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై నటి వీణా మాలిక్ తొలిసారి స్పందించారు. తనకు 26 యేళ్ళ జైలుశిక్ష పడిందా ఒకే.. జీవితశిక్ష అంటే 26 యేళ్ళా. ఈ తీర్పు విని షాక్‌కు గురయ్యాను. అయితే, పాకిస్థాన్ ఉన్నత కోర్టులపై నాకు నమ్మకం ఉంది. తుది తీర్పు వచ్చే సమయానికి తనకు న్యాయం జరుగుతుంది. తనకు వ్యతిరేకంగా ఎలాంటి చెడు జరగదు అని చెప్పుకొచ్చింది.
 
కాగా, దైవదూషణ కేసులో పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్‌కు పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు 26 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని జియో టీవీలో దైవదూషణ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీణామాలిక్‌కు కోర్టు శిక్ష విధించింది. 
 
వీణా మాలిక్‌తోపాటు ఆమె భర్త బషీర్, టెలివిజన్ యాంకర్ షకి ష్టా వాహిది, జియో టీవీ అధిపతి మీర్ షకీల్ ఉర్ రెహ్మాన్‌కి కూడా కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. దైవాన్ని దూషించే కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వీరందరూ క్షమాపణలు చెప్పారు. అయితే పాకిస్థాన్‌లోని అతివాదులు మాత్రం వీరికి శిక్ష విధించాలని పట్టుబట్టారు. ఈ నలుగురికీ 26 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13 లక్షల రూపాయల జరిమానాని కూడా కోర్టు విధించింది. 
 
కాగా, ఈ తీర్పుపై వీణామాలిక్ స్పందిస్తూ.. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు ప్రకటించారు. తనకు దైవంపై నమ్మకం ఉందని, అందువల్ల పై కోర్టుల్లో తప్పుకుండా న్యాయం జరుగుందన్న విశ్వాసం తనకుందని ఆమె చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments