Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒకరోజు' ఏం జరిగింది...?

Webdunia
సోమవారం, 21 జులై 2014 (19:38 IST)
'ఒక రోజు'లో ఏం జరిగింది? అనే పాయింట్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో కూడిన చిత్రం రూపొందుతోంది. 'వేట', 'ఉడుతా ఉడుతా ఊచ్‌' వంటి చిత్రాలను రూపొందించిన తడకల రాజేష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగించుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి చెబుతూ... ప్రేమకథలోనే సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తూ నిర్మించిన చిత్రమిది. ఇందులో నటించిన ప్రతిపాత్రకు గుర్తింపు ఉంటుంది. కథలో సాగే క్యారెక్టర్లే. కథనాయకుడు ఎలా ఉండాలనేది ఐదు పాయింట్లతో ఈ చిత్రంలో చెప్పాం. భారీవర్షంలో నర్సాపూర్‌ ఫారెస్ట్‌లో చిత్రించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు.
 
కథానాయకుడు శ్రీకాంత్‌ వివరిస్తూ... ప్రేమకథే అయినా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నాన్ని దర్శకుడు చక్కగా చేశారని పేర్కొన్నారు. ఇందులో కథానాయికగా నటించడం పట్ల గీతాంజలి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కృష్ణభగవాన్‌, జూ.రేలంగి, తాగుబోతు రమేష్‌, నాగిరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివా, కెమెరా: వెంకట్‌, కథ, కథనం, మాటలు, నిర్మాత, దర్శకత్వం: తడకల రాజేష్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments