Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దోచేయ్‌' సెన్సార్‌ పూర్తి - వరల్డ్‌వైడ్‌గా ఏప్రిల్‌ 24 విడుదల!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (11:14 IST)
నాగచైతన్య హీరోగా, కృతి సనన్‌ హీరోయిన్‌గా భోగవల్లి బాపినీడు సమర్పణలో వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'స్వామిరారా' దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'దోచేయ్‌'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 24న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ''మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. సన్ని ఎం.ఆర్‌. సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. అత్తారింటికి దారేది వంటి సూపర్‌హిట్‌ తర్వాత మా బేనర్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది. అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా, మా బేనర్‌ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా 'దోచేయ్‌' నిలుస్తుంది'' అన్నారు. 
 
యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments