Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య - సుధీర్‌ వర్మల 'దోచేయ్‌' చిత్రం మొదటి పాట విడుదల

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (15:36 IST)
'ఏమాయ చేసావె', '100% లవ్'‌, 'తడాఖా', 'మనం' వంటి చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌ వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 'దోచేయ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 3న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను ఈరోజు నుంచి ఏప్రిల్‌ 1 వరకు రోజుకో పాటను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు 'నచ్చితే ఏ పనైనా.. నవ్వుతూ చేసి రానా. ఎవ్వడు ఏమిటన్నా.. ఆగక సాగిపోనా..' అంటూ సాగే ఈ పాటను ఈరోజు విడుదల చేశారు. రేపటి నుంచి రోజుకో పాట చొప్పున ఏప్రిల్‌ 1 వరకు మరో నాలుగు పాటలు విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్‌ 2న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 3న లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ అవుతోంది. ఏప్రిల్‌ 17న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి నిర్మాత  బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు. 
 
యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెచ్చా కంఫక్డే, విజయ్‌, డాన్స్‌: జానీ, శేఖర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌ ఈదర, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments