Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ నారాయణ మృతి.. పరిశ్రమను ఏదో ఆవహించింది : మురళీమోహన్!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (11:23 IST)
హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్రపరిశ్రమకు షాకింగ్ న్యూస్ అని సినీనటుడు, టీడీపీకి చెందిన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఎమ్మెస్ నారాయణ మృతిపై ఆయన స్పందిస్తూ.. రచయితగా, దర్శకుడిగా రాణించలేక పోయిన నారాయణ హాస్య నటనలో మాత్రం ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారన్నారు. సినిమా, సినిమాకు ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేవన్నారు.
 
మొదటి సారిగా ఎంఎస్ నారాయణ తన దగ్గరకు కథ చెప్పడం కోసం వచ్చారని, అనుకోకుండా ఈవీవీ సత్యనారాయణ ద్వారా నటుడుగా మారారని మురళీమోహన్ తెలిపారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయన నటన వినూత్నంగానే ఉండేదని గుర్తు చేసుకున్నారు.
 
నారాయణ ఆరోగ్యంపై వదంతలు వస్తే.. కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి ఎంఎస్ నారాయణ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కోరినట్లు మురళీమోహన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదో పట్టుకుందని, 23 రోజుల్లో ఇది నాలుగో చావు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్ నారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని మురళీమోహన్ పేర్కొన్నారు. 

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments