Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 3న 'ముకుంద' ఆడియో... 24న సినిమా విడుదల

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (18:10 IST)
ఈ తరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత ప్రధానాంశాలుగా పట్టణ నేపథ్యంలో సాగే చిత్రం 'ముకుంద'. ఇందులో రూరల్ అర్బన్ కుర్రాడిగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరో నటించిన ఈ తొలి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ఇది. 
 
ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి మిక్కీ.జె. మేయర్ పాటలు స్వరపరిచారు. వచ్చే నెల 3న పాటలను, 24న  ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ''వరుణ్ తేజ్ అద్భుతంగా నటిస్తున్నాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడలేదు'' అని చెప్పారు.
 
నిర్మాతలు మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. వరుణ్ చాలా బాగున్నాడని, మంచి మాస్ హీరో అనిపించుకుంటాడని అందరూ అంటున్నారు. డాన్సులు, ఫైట్స్ అన్నీ బాగా చేశాడు. ఈ చిత్రం ఖచ్చితంగా తనకు మంచి లాంచింగ్ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు. నాజర్, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments