Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ సినిమా: మెగాఫోన్ పట్టనున్న మెగాస్టార్?

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (15:08 IST)
మెగాస్టార్ మెగాఫోన్ పట్టనున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నయ్య నటించే 150వ సినిమాపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. స్క్రిప్ట్‌కు చిరు ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. 150వ సినిమా కథలో ఎన్ని మలుపులు.. నిర్మాణ సారథ్యంలో క్లారిటీ లేకుండా పోవడంతో.. అన్నయ్య సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 
చిరంజీవి 150వ సినిమా కథ నుంచి దర్శకుడి వరకు ఇంతవరకు ఏదీ ఓకే కాలేదు. మూడు కథలు రెడీ చేశామని రామ్ చరణ్ చెప్పినప్పటికీ చిరంజీవి ఇంకా వాటి నుంచి ఏదీ ఫైనల్ చేయలేదట. అలాగే, దర్శకుడిగా వినాయక్ పేరు మొదటి నుంచీ  వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు అది కూడా మరుగునపడింది. 
 
ఇన్నాళ్లూ వెయిట్ చేసిన వినాయక్ ఇప్పుడిక అఖిల్ సినిమాకి కమిట్టయిపోయాడు. ఈ నేపథ్యంలో తన రీ ఎంట్రీ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై చిరంజీవి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తాజా సమాచారం. 
 
తన సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చిరు మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారట. అదే కనుక నిజమైతే, ఇక ఈ సినిమాకి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదనే చెప్పవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments