Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకబ్జా కేసులో మణిశర్మపై చెన్నైలో కేసు నమోదు!

Webdunia
ఆదివారం, 6 జులై 2014 (13:44 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై ఓ భూకబ్జా కేసు నమోదైంది. ఈ కేసులో చెన్నై ఆలందూరు కోర్టులో నేరవిభాగపు పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. మణిశర్మకు స్థానిక నీలాంగరై సమీపంలోని కానాత్తురులో కొంత స్థలం ఉంది. ఈ స్థలానికి కంచె వేసే సమయంలో తనకు చెందిన 75 సెంట్ల భూమిని కూడా కలుపుకున్నట్లు కరుప్పన్‌ అనే వ్యక్తి మణిశర్మపై నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ కేసు విచారణ చేపట్టిన నేర విభాగపు పోలీసులు కంచెవేసిన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు పాల్పడినట్లు తేలడంతో, ఆలందూర్‌ కోర్టుకు నివేదించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మణిశర్మ ముందస్తు బెయిల్‌ పొంది ఉన్నారు. కాగా, నకిలీ పత్రాలతో దాదాపు 10 కోట్ల విలువ చేసే భూమిని మణిశర్మ కబ్జా చేసినట్లు ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే మణిశర్మ మేనేజర్‌ని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ కోసం మణిశర్మను త్వరలో పిలిపిస్తారని తెలుస్తోంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments