Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు కుటుంబ వేడుక... హీరో మనోజ్‌, ప్రణతిల నిశ్చితార్థం...!

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (09:48 IST)
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత డాక్టర్ ఎం.మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కి సంకెళ్లు పడనున్నాయి. అంటే... యంగ్ హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్ధం బుధవారం జరుగుతుంది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు పలువురు ప్రముఖ రాజకీయ మరియు సినీ తారలను ఆహ్వానించారు.
 
ఇందుకోసం మోహన్‌బాబు కుటుంబం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా హాజరు కానున్నట్టు సమాచారం. కాగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రానుండటంతో మంగళవారం హోటల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
తమ కుటుంబంలోకి రాబోయే 'ప్రణతిరెడ్డి' తనకు మూడో కూతురు అని హీరో మోహన్ బాబు ట్విట్ చేసిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి, విరానికా లాగా తనకు ఆమె మరో కుమార్తెగా ఆయన అన్నారు. కాగా ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతేకాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments