Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ను టెన్షన్ పెడుతోన్న తమన్నా ప్లాప్ స్టోరీ!

Webdunia
గురువారం, 19 జూన్ 2014 (15:25 IST)
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ''ఆగడు'' సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది డెఫినిట్‌గా ''దూకుడు''ను మించి విజయం సాధిస్తుందని అటు ఫిల్మ్‌నగర్‌లో, ఇటు అభిమానుల్లో టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ టెన్షన్ పడుతున్నాడట.

ఆగడులో మహేష్‌కు జోడిగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఇటీవల ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. తాజాగా ఈమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో ఈ సెంటిమెంట్ తన సినిమాకు కూడా రిపీట్ అవుతుందేమోనని మహేష్ టెన్షన్ పడుతున్నాడట.

ఇటీవల తమన్నా నటించిన సినిమాల్లో హిట్ పర్సంటేజి కన్నా అట్టర్ ఫ్లాప్‌లు మాత్రం చాలానే వున్నాయి. పవన్ కెమేరామెన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్ బధ్రీనాధ్, రామ్ 'ఎందుకంటే ప్రేమంట', ఎన్టీఆర్ ఊసరవెల్లి, ప్రభాస్ రెబల్ ఈమె కెరియర్‌లో చెప్పుకోదగ్గ ఫ్లాప్‌లు. బాలీవుడ్‌లో ఆమె నటించిన 'హిమ్మత్ వాలా' కూడా ప్లాప్ కావడంతో తమన్నా ప్లాప్ హీరోయిన్‌గా మారిపోయింది. మరి తమన్నా ఈ ప్లాప్ హీరోయిన్ ముద్రను ఆగడుతో చెరిపేసుకుంటుందో లేక సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందో వేచి చూడాలి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments