Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబునే ఏపీకి బ్రాండ్ అంబాసిడరా.? ఇంకేముంది అదిరిపోద్ది!!

Webdunia
గురువారం, 24 జులై 2014 (14:01 IST)
మహేష్ బాబు అభిమానులకో శుభవార్త. ఇప్పటివరకు సినిమాల్లో, ప్రకటనల్లో దూసుకుపోతున్న మహేష్ బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితమవుతారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి టెన్నిస్ తార సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తరుణంలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని ఎంపిక చేద్దామా అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారట. 
 
అంతేకాదు.. ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారట. తప్పకుండా ఏపీ అంబాసిడర్‌గా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబునే నియమించాలనుకుంటున్నారట. మరి ఇందుకు మహేష్ బాబు పచ్చజెండా ఊపాడో లేదో తెలియదు కానీ మహేష్ మాత్రం ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇంకేముంది.. అదిరిపోద్దని అభిమానులు హ్యాపీగా ఉన్నారట. 
 
కాగా ఇప్పటికే  గుజరాత్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఢిల్లీకి అక్షయ్ కుమార్, కేరళకు మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా సెలక్ట్ అయిన సానియా మీర్జా ప్రమోషన్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
తెలంగాణకు ఇంటర్నేషనల్ అప్పీల్ తెచ్చేందుకు.. సానియా పాపులారిటీ తెలంగాణకు ప్లస్ అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని ఎంపిక చేద్దామని బాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. హీరోయిన్‌ను ఎంచుకుందామా? హీరోను ఎంచుకుందామా?.. సినీ ఆర్టిస్టులైతా బెటరా? వారికి నేషనల్ స్థాయిలోనైనా పేరుందా ? అనే కోణాల్లో బాబు సర్కార్ యోచిస్తోంది. 
 
ఇంకా బ్రాండ్ అంబాసిడర్ రేసులో ఇప్పటికే పవన్ కల్యాణ్, బాలయ్య బాబు, ఎన్టీఆర్‌తో పాటు మహేష్ బాబు కూడా ఉన్నారు. అలాగే ఎన్నారై ప్రముఖులను సైతం బరిలోకి దించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అత్యధికంగా మహేష్ బాబునే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికవుతారని తెలుగు తమ్ముళ్లు సైతం అంటున్నారట. ఒకవేళ ఏపీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే గుజరాత్‌కు అమితాబ్ తరహాలో ప్రమోషన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. మరి మహేష్ తన బ్రాండ్ ఇమేజ్‌ను ఏపీ కోసం ఏమేరకు ఉపయోగిస్తారో వేచి చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments