Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా తీసేటపుడు కాస్త చూసి ఖర్చు పెట్టుకోండి... మహేష్

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (13:52 IST)
సినిమాకు బడ్జెట్‌ అనేది కీలకం. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాక.. తిరిగి రాకపోవడంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు కృష్ణ.. నిర్మాతకు సినిమా లాస్‌ వస్తే... తదుపరి సినిమాను తీయడమో...లేదంటే కొంత పారితోషికాన్ని తగ్గించుకోవడమే జరిగేది. అయితే ఈ విషయంలో మహేష్ బాబు నిక్కచ్చిగా వున్నాడు. '1' నేనొక్కడినే సినిమా నిర్మాతలకు నిరాశపర్చినా... బడ్జెట్‌ కంట్రోల్‌ చేసుకుంటే బాగుండేదని పలువురు ప్రముఖులు సూచించారు. 
 
అందుకే కాబోలు.. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న చిత్రం బడ్జెట్‌ విషయంలో నిర్మాతలైన మైత్రీ ఫిలింస్‌ అధినేతలను పిలిచి.. కంట్రోల్‌లో వుంచుకోండని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ 40 కోట్లకు మించి దాటితే వసూళ్ళు అంతే రేంజ్‌గా వుండేలా చర్యలు తీసుకోవాలని దర్శకుడికి చెప్పినట్లు ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. 
 
త్వరలో ఈ చిత్రం సెట్‌ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అవుట్‌డోర్‌ షూటింగ్‌కు చెందిన సామాగ్రిని మొత్తం మైత్రీ ఆఫీసులో భద్రపరిచారు. అన్నీ కొత్తగా కొనుగోలు చేసిన పనిముట్లే వుండటం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments