Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ట్రిపుల్ ధమాకా... సెప్టెంబర్ 19న 'ఆగడు'

Webdunia
శనివారం, 19 జులై 2014 (13:11 IST)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సినిమా ప్రారంభ అయిన నాటి నుంచే  క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. బర్త్ డేకు ఫ్యాన్స్‌కు కానుక‌గా ట్రైల‌ర్ రిలీజ్ చేయటం మ‌హేష్ సినిమాల‌కు ఆన‌వాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా శ్రీ‌ను వైట్ల‌, మ‌హేష్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఆగడు ట్రైల‌ర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 
 
ఆగ‌స్ట్ ‌9న మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘ఆగ‌డు’ అఫిషియ‌ల్ థియేరిటిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే ఆడియో రిలీజ్ డేట్‌ను కూడా ఫ్యాన్స్ పండుగ  చేసుకునే రోజే  ప్రకటించడం విశేషం. ఆగ‌డు ఆడియో  ఆగ‌స్ట్ ‌31న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆరోజు మ‌హేష్ కొడుకు గౌతమ్‌ కృష్ణ పుట్టిన‌రోజు కావ‌డం విశేషం.
 
వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న శృతి హాస‌న్ ఆగడు సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేయనుంది. మ‌రోవైపు మ్యూజిక్ సంచ‌ల‌నం థ‌మ‌న్‌కు ఇది 50వ చిత్రం మ‌రో ప్రత్యేకత. తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున టీజ‌ర్ రిలీజ్‌, త‌న బ‌ర్త్‌డే రోజు ట్రైల‌ర్‌ను, కొడుకు బర్త్ డేకు  ఆడియోని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధ‌మాకా ఇస్తున్న మ‌హేష్ సెప్టెంబ‌ర్ 19 లేదా 26 తెర‌పైకి దూసుకురానున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

Show comments