Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లింగ' పంపిణీదారులకు ఆర్థిక సాయం చేస్తా : నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (20:02 IST)
'లింగ' చిత్ర పంపిణీదారులకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ప్రకటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'లింగ' సినిమాకు ఫ్యాన్సీ రేటు చెట్టించి డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఫలితంగా విడుదలైన వారం రోజులకే నష్టాలు వచ్చాయని, రజినీకాంత్ జోక్యం చేసుకుని నష్టాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆ చిత్రం నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తాజాగా ముందుకు వచ్చి డిస్ట్రిబ్యూటర్లు వ్యవహరిస్తున్న తీరు న్యాయ సమ్మతంగా లేదని, ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలి కానీ ఆందోళనకు దిగడం ఏంటని నిలదీశారు. అయినప్పటికీ వారు దిగి రాకుండా రజినీకాంత్ జోక్యం పదేపదే కోరడంతో పాటు, ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో వారి నష్టాన్ని చెల్లించేందుకు నిర్మాత ముందుకు వచ్చారు.
 
దీంతో 'లింగ' డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టం లెక్కల వివరాలను నిర్మాతకు అందజేశారు. మరో మూడు రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ నష్టంలో కొంత భాగాన్ని రజినీకాంత్ చెల్లిస్తారని తెలుస్తోంది. గతంలో 'బాబా' సినిమా సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని రజినీ పూర్తిగా భరించిన విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments