Webdunia - Bharat's app for daily news and videos

Install App

యదార్థ ఘటనతో 'బుడుగు'... లక్ష్మీ మంచు 'అమ్మ'

Webdunia
శనివారం, 2 ఆగస్టు 2014 (18:11 IST)
ప్రతి తల్లీ తండ్రి తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అది ఆ పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. పిల్లల ఇంట్రెస్ట్, సామర్థ్యానికి మించిన ఒత్తిడి పెరిగితే పిల్లలు ఎలా రియాక్ట్‌ అవుతారు? అలాంటి పరిస్థితి ఎదురైన ఓ పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని విచిత్ర సంఘటలనతో అతని కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? వారెలా సమస్యల నుంచి బయటపడ్డారు? అనే అంశంతో 'బుడుగు' అనే చిత్రం రూపొందుతోంది. 
 
ఇది పూర్తి చైల్డ్‌ క్లినికల్‌ సైకాలజీ కోణంలో నడిచే ఇంటెన్స్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌. ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం మధ్య పట్టు సడలని డ్రామాతో నడుస్తూ, ప్రేక్షులను ఉద్వేగానికి గురిచేసే కథ ఇది. త్వరలో షూటింగ్‌ పూర్తిచేసుకోబోతున్న ఈ చిత్రం ఇన్నోవేటీవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, ప్రేం బాబు నటిస్తుండగా, మరికొన్ని ముఖ్య ప్తారల్లో బేబి డాలీ, సన, ఇందు, ఆనంద్‌, శైలజవాణి నటిస్తున్నారు. 
 
దర్శకుడు మన్‌మోహన్‌ మాట్లాడుతూ.. నాకు తెలిసిన ఓ సంఘటన ఆధారంగా పూర్తిస్థాయి పరిశోధించి అనేకమంది సైకాలజిస్ట్‌లతో చర్చించుకుని తయారుచేసుకున్న కథ ఇది. తెలుగు కథల్లో కొత్తగా వుంటుందని నమ్ముతున్నానని తెలిపారు. దీనికి సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ మేంగా, కళ: ఎ.రాం. సినిమాటోగ్రఫీ: సురేష్‌ రగుతు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వంశీ పుల్లురి, నిర్మాతలు: భాస్కర్‌, సారిక శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: మన్‌మోహన్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments