Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేష్‌కి గయ్యాలి చెల్లెలిగా కార్తీక... అలా సెటిలైపోయిందా...?

Webdunia
సోమవారం, 28 జులై 2014 (18:08 IST)
అల్లరి నరేష్‌, మోనాల్‌ గజ్జర్‌ జంటగా 'వీడుతేడా' దర్శకుడు బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో సిరి సినిమా పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇ.వి.వి. సత్యనారాయణ సమర్పణలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మిస్తున్నారు. కార్తీక నరేష్‌కి చెల్లెలుగా నటిస్తోంది. టాకీపార్ట్‌, మూడు పాటలు పూర్తయ్యాయి. మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉంది.  
 
అల్లరి నరేష్‌ మాట్లాడుతూ... ఇప్పటివరకు తెలుగు తెరపై అన్నచెల్లెళ్ళ సినిమాలెన్నో వచ్చాయి. అవన్నీ ఎమోషన్‌, సెంటిమెంట్‌తో ప్రేక్షకుల్ని ఏడిపించాయి. ఈ సినిమా అందర్ని నవ్విస్తుంది. ఇందులో నాకు చెల్లెలుగా కార్తీక నటిస్తోంది. గయ్యాలి, బొమ్మాళి పదాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఆమె పాత్ర ఉంటుంది. రోప్‌తో ఫైట్స్‌, డాన్స్‌లు అవలీలగా చేసేసింది. చిన్నికృష్ణ దర్శకత్వంలో వచ్చిన వీడుతేడా సినిమా నాకెంతో నచ్చింది. ఆయన డైరెక్షన్‌ తీరు కూడా బావుంది. 
 
కామెడీ సినిమాలకు టైటిల్‌ నిర్ణయించడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకే ఆ బాధ్యతను ఆడియన్స్‌పై వేశాం. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లో మా సినిమా టైటిల్‌ కోసం కాంటెస్ట్‌ పెట్టాము. ఇప్పటికి చాలా టైటిల్స్‌ వచ్చాయి. మరో నాలుగు రోజల్లో  టైటిల్‌ ఖరారు చేసి ఆగస్ట్‌ 10వ తేదిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం. ఆగస్ట్‌కి మొదటి వారానికి షూటింగ్‌ పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని తెలిపారు. 
 
కార్తీక మాట్లాడుతూ... హీరో డామినేటింగ్‌ ఇండస్ట్రీలో అమ్మాయిలకు పవర్‌ఫుల్‌ రోల్స్‌ ఉంటాయని ఈ సినిమాలో యాక్ట్‌ చేశాక తెలిసింది. ఇందులో నరేష్‌కి చెల్లెలుగా హీరోతో సమానమైన పాత్ర చేశాను. ఇందులో మేమిద్దరం ట్విన్స్‌. అతని పేరు రాంకీ, నా పేరు లక్కీ. ఇటువంటి పాత్ర మళ్ళీ దొరకకపొవచ్చు. మాస్‌ లుక్‌లో చాలా బోల్డ్‌గా నా పాత్రను డిజైన్‌ చేశారు. తెలుగులో నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రమవుతుందని పూర్తి నమ్మకం ఉంది అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments