Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మల్లికార్జున్ కాంబినేషన్‌లో కళ్యాణ్.. హిట్టా ఫట్టా...!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (14:02 IST)
నందమూరి ఫ్యామిలీ యంగ్ హీరో కళ్యాణ్ రామ్. ఈ హీరోకి హిట్ అంటే అంతా ఇష్టం ఉండదేమో... హిట్టు ఇతన్ని వహించడం కష్టం. ఎందుకంటే ఈ యంగ్ హీరో సెలెక్ట్ చేసేది అంతా కొత్త వారినే. సినిమా పరిశ్రమకు కొత్తగా పరిచయం అయ్యే వారిని కళ్యాణ్ రామ్ బాగా ప్రోత్సహిస్తాడు. కళ్యాణ్ రామ్ కి అతనొక్కడే వంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి‌కి అదే తోలి సినిమా. ఇక ఈ మధ్య పటాస్ తో హిట్ అందుకున్న అని రావిపూడి కూడా కొత్తవాడే.
 
ఇక కళ్యాణ్ రామ్ రెండో సినిమా అభిమన్యు సినిమాని మల్లికార్జున్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. అది ఫ్లాప్ అయినా అదే దర్శకుడితో కత్తి చేశాడు. అది మంచి సినిమా అనిపించుకుంది....కానీ ఫలితం మాములే. ఈ విధంగా అపజయాలు ఎదురైనప్పటికీ, తాజాగా అదే దర్శకుడితో 'షేర్' అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. 
 
అసలు పటాస్ సినిమాతో పాటు ఈ సినిమాని ప్రారంభించాడు కళ్యాణ్ రామ్. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు కథ , మాటలు అందించాడు. వన్యా మిశ్రా హీరోయిన్. వరుసగా సొంత బ్యానర్‌లో సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాని వేరే బ్యానర్‌లో చేస్తుండటం విశేషం. 
 
కొమర వెంకట్ షేర్ నిర్మాత. మొన్నటివరకు ఈ సినిమాపై ఎవరి దృష్టి లేదు కానీ , పటాస్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా అవడంతో క్రేజ్ వచ్చేసింది. మరి ఈ సినిమా అంచనాలని అందుకుంటుందా ? కళ్యాణ్ రామ్ తో మల్లికార్జున్ మూడో ప్రయత్నం ఫలిస్తుందా? చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments