Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్‌ ఎన్టీఆర్ తండ్రయ్యాడోచ్ : సీనియర్ ఎన్టీఆర్ పోలికలొచ్చాయా?

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (14:19 IST)
జూనియర్ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు మంగళవారం పండంటి బాబు పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్‌కు బాబు పుట్టడంతో అటు నందమూరి, నారా కుటుంబం పండగ చేసుకుంటుంటే.. అభిమానులు సైతం నందమూరి వంశానికి కొత్త వారసుడొచ్చాడని స్వీట్లు పంచుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు.
 
ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తాత పోలికలో పుట్టాడు కాబట్టి.. అతని పుత్రుడికి కూడా సీనియర్ ఎన్టీఆర్ పోలికలు వచ్చాయోమోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జూనియర్ పుట్టిన జూనియర్‌కు సీనియర్ పోలికలొచ్చేస్తే ఎంతో సంతోషంగా ఉంటామని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. 
 
కాగా నందమూరి ఇంట మంగళవారం మరో వారసుడు జన్మించాడు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయ్యారు. జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పండండి మగబిడ్డ జన్మించాడు. మంగళవారం మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని రైన్ బో ఆస్పత్రిలో ప్రణతి బాబుకు జన్మనిచ్చారు. 
 
జూనియర్‌కు మరో జూనియర్ జన్మించడంతో నందమూరి, నార్నే కుటుంబాల్లో సందడి నెలకొంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి వెళ్లి తమ వారసుడిని చూశారు. ఈ సందర్భంగా హరికృష్ణ ఫోన్లు చేస్తూ పలువురితో తన ఆనందాన్ని పంచుకున్నారు.
 
ఇదిలా ఉంటే అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలకు కూడా మగశిశువు జన్మించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తనయుడి ఫస్ట్ లుక్ ఫోటోలను బన్నీ విడుదల చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ తన పుత్రుడిని ఎప్పుడు చూపిస్తారా అంటూ అభిమానులు వేచి చూస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments