Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఎలాంటి అనారోగ్యం లేదు... కమల్ హాసన్

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (19:54 IST)
కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారనీ, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారని వార్తలతోపాటు, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న వదంతులు ఒక్కసారిగా తిరుగాడాయి. ఐతే అదేమీ లేదంటూ కమల్ హాసన్ స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు.
 
తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమల్ హాసన్ తెలిపారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురయ్యానని, అంతకంటే ఏమీలేదన్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఫోన్‌లో కమల్ మాట్లాడుతూ.. "చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలనుకుంటారు. వారిని నిరుత్సాహపరుస్తున్నందకు సారీ. నేను బాగానే ఉన్నా. కేవలం ఫుడ్‌పాయిజన్ అయిందంతే. అంతకుమించి మరే కారణం లేదు" అని వివరించాడు. 
 
'పాపనాశనం' చిత్రం కోసం కేరళ మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందని, అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న దాబాల్లో తిన్నామన్నారు. బహుశా కలుషిత నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కమల్ పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్, డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నేను బాగానే వున్నాను. షూటింగ్ నిమిత్తం కేరళలోని మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో ఏదిపడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఆయన వివరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments