Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృతిక్ విడాకులు... 13 ఏళ్ల తర్వాత పెళ్లి పెటాకులు..

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (16:58 IST)
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పెళ్ళి 13 ఏళ్ల తర్వాత పెటాకులైంది. కోర్టు హృతిక్ రోషన్‌కి, ఆయన భార్య సుజానే ఖాన్‌కి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అమ్మాయిలకు డ్రీమ్‌బోయ్‌లా ఓ వెలుగు వెలిగిన హృతిక్ చివరికి తన భార్య నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొని విడాకులు పొందాల్సి వచ్చింది. ముంబైలోని కుటుంబ కోర్టు శనివారం నాడు వీరిద్దరి పరస్పర అంగీకారం మేరకు విడాకులను ఇచ్చింది.
 
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ దంపతులకు విడుకాలు వచ్చాయి. హృతిక్ 2000 సంవత్సరంలో సుసాన్నెను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రేహన్, హృదన్ ఉన్నారు. హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ స్థితిలో వీరికి శనివారం బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. 
 
ఈ విషయమై హృతిక్ న్యాయవాది దీపేష్ మెహతా మాట్లాడుతూ పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులకు ఇద్దరికీ సంయుక్తంగా అప్పగించినట్టు చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments