Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్: గౌరీకి ప్రపోజ్ చేసి.. వెక్కి వెక్కి ఏడ్చాడట!!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (13:31 IST)
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్.. గౌరీల మ్యారేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముస్లిం అయిన షారూఖ్.. హిందూ అయిన గౌరీని తన భార్యగా చేసుకుని ఆదర్శ దాంపత్యానికి మరోపేరులా నిలిచారు. 
 
ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అడ్డంకులు.. అన్నింటినీ కలసికట్టుగా అధిగమించిన ఈ జంట మరెందరికో ఆదర్శప్రాయం. అయితే షారూఖ్ ఖాన్ లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడట. అంత పెద్ద హీరో అయినప్పటికీ ప్రేమ అనేసరికి ప్రియురాలు ఓకే చెబుతుందో లేదోనని టెన్షన్ పడ్డాడట. 
 
కాగా, ఢిల్లీ వాసులైన షారూఖ్, గౌరీ మంబయి రాకమునుపే స్నేహితులు. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో ఏర్పడిన ఆ పరిచయం ముంబయి వచ్చేనాటికి ప్రేమగా మారింది. అయితే, తన మనసులో గూడుకట్టుకున్న అపురూప భావనను గౌరీ ముందుంచడం ఎలా అన్నది షారూఖ్‌కు పెద్ద క్వశ్చన్ మార్కులా తయారైంది. 
 
చివరికి ఓ రోజు ముంబయి బీచ్‌‌లో ఉండగా తన స్వీట్ హార్ట్‌తో షారూఖ్ ఐ లవ్యూ చెప్పేశాడు. అంతేగాకుండా, పెళ్ళి చేసుకోమని కోరాడు. తన ప్రపోజల్‌కు గౌరీ ఓకే చెప్పేయడంతో చూడాలి షారూఖ్ పరిస్థితి! వెంటనే ఆమె చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చేశాడట.
 
ఏళ్ళ తరబడి గుండెల్లో దాచుకున్న ప్రేమకు ప్రియురాలి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కంటే నిజమైన ప్రేమికుడు ఇంకేం కోరుకుంటాడు? షారూఖ్ కూడా అలాంటి వ్యక్తే. అందుకే, ప్రేమకు గౌరీ పచ్చజెండా ఊపగానే, ఆమెను గట్టిగా హత్తుకుని, తన ఆనందాన్ని ఇలా వ్యక్తపరిచాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments