Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై అలనాటి హీరోయిన్ల రీ ఎంట్రీ!: అదుర్స్ అనిపిస్తోందట!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (19:09 IST)
ఒకప్పుడు వెండితెరపై అలరించిన హీరోయిన్లు కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి ఇటీవలే తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి షూటింగ్‌లో పాల్గొంది. హీరో విజయ్‌కు తల్లిగా నటించనుంది. దీనితో ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద క్రేజ్‌ ఏర్పడింది. 
 
మరోవైపు.. జ్యోతిక కూడా.... సూర్యను వివాహం చేసుకుని, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ వుండేది. ప్రస్తుతం బిడ్డ తల్లి అయ్యాక.. కొంతకాలం ఆలనాపాలనా చూసుకుంది. కానీ మళ్ళీ తెరపై కన్పించాలనే ఇంట్రెస్ట్‌తో ముందుకు వచ్చింది. 
 
మలయళంలో విజయవంతమైన చిత్రం 'హౌ ఓల్డ్‌ ఆర్‌ యు'. విజయవంతమైంది. అది తమిళంలో రీమేక్‌ అవుతుంది. మంగళవారంనాడే ఆ చిత్రం షూటింగ్‌ ఢిల్లీలో ప్రారంభమైంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక నటిస్తోంది.  
 
అదే బాటలో నటి గౌతమి. కమల్‌ హాసన్‌తో సహజీవనాన్ని చేస్తున్న ఈమె.. ఒకప్పుడు యూత్‌ కలలరాణి. అనారోగ్యకారణంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలో కమల్‌ ఇచ్చిన సపోర్ట్‌తో ఆమె దగ్గరైంది. ఇప్పుడే అదే కమల్‌ నటిస్తున్న 'పాపనాశనం'లో నాయికగా కన్పించబోతుంది. తమిళం రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో డబ్‌ కాబోతుంది. 
 
అక్కినేని అమల కూడా... అక్కినేని నాగార్జునతో 'శివ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆయనకు జీవిత భాగస్వామి అయిన ఈమె చాలాకాలం సినిమాల్లో నటించలేదు. ఇటీవలే కేన్సర్‌ పేషెంట్‌గా లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంలో నటించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఓ టెలీషోతో తమిళనాట రీ ఎంట్రీ అయింది. ఈ షోద్వారా సామాజిక సందేశాన్ని ఇవ్వడమే తన ఉద్దేశ్యమని చెబుతోంది. 
 
శ్రియారెడ్డి.... నటుడు విశాల్‌ సోదరుడు విక్రమ్‌ కృష్ణను పెండ్లి చేసుకున్న ఈమె.. అంతకుముందు హీరోయిన్‌గా నటించింది. విశాల్‌ సరసనకూడా ఓ సినిమాలో నటించింది. పెండ్లి తర్వాత గ్యాప్‌ ఇచ్చిన ఆమె ప్రస్తుతం 'అందాళ కానుమ్‌' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. వీరేకాకుండా మధూ అనే తమిళనటి కూడా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో నటించబోతుంది. ఇలా హీరోలేకాదు. హీరోయిన్లుకూడా రీ ఎంట్రీతో తమ సత్తా ఏమిటో చూపించబోతున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments