Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియా తల్లైందోచ్.. Its a BBBOOOOYYYYYY అంటూ రితేష్ ట్వీట్!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:17 IST)
ఆమధ్య జెనీలియా ప్రెగ్నెంట్‌గా వుందని కొన్ని ఫొటోలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెనీలియా తల్లైంది. ఆమె మంగళవారం నాడు పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలిపాడు. Its a BBBOOOOYYYYYY అంటూ రితేష్ ట్విట్ చేశాడు. 
 
రితేష్ ట్వీట్ చేసిన విధానమే ఆయన చాలా హ్యాపీగా ఉండే విషయాన్ని తెలియజేస్తోంది. ఇంకా రెండేళ్ల క్రితం మరణించిన రితేష్ తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేశ్‌‌ముఖ్.. తనకు పిల్లాడుగా పుట్టాడని రితేష్ భావిస్తున్నట్లు సన్నిహితుల సమాచారం.  
 
ఇంకా తనకు నట వారసుడు పుట్టాడని రితేష్ ఉబ్బితబ్బివవుతున్నాడని తెలిసింది. కాగా జెనీలియా నిండు గర్భిణిగా వున్నప్పటికీ హైదరాబాద్‌లో జరిగిన సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్ళికి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు. తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 
 
ఇకపోతే.. రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసిన అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments