Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌ మరో అనుష్క... గోపీచంద్ కితాబు

Webdunia
శనివారం, 2 మే 2015 (21:21 IST)
రకుల్‌ ప్రీత్‌సింగ్‌ టాలీవుడ్‌లో మరో అనుష్క అని దర్శకుడు మలినేని గోపీచంద్‌ కితాబిచ్చారు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ హీరోగా పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో యునైటెడ్‌ మూవీస్‌ బ్యానర్‌పై గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో పరుచూరి కిరిటీ నిర్మిస్తోన్న చిత్రం 'పండచేస్కో'. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు గోపిచంద్‌ మలినేని మాట్లాడుతూ ''ఈ సినిమాని ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాను. రామ్‌ నాకు బ్రదర్‌. తనలోని ఎనర్జీని సరైన రీతిలో ఈ సినిమాలో వాడుకున్నాను. క్లయిమాక్స్‌లో తను అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. 

 
నిజానికి రామ్‌తో ఎప్పుడో సినిమా చేయాల్సింది. ఈ సినిమాకి కుదరింది.  సాయికుమార్‌, సంపత్‌రాజ్‌, ఆదిత్యమీనన్‌ ఇలా అందరూ భారీ తారాగణం నటించిన చిత్రమిది. పరుచూరి ప్రసాద్‌గారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్‌ సపోర్ట్‌ మరచిపోలేను. తను టాలీవుడ్‌కి మరో అనుష్క. దాదాపు పద్దెనిమిది నెలలు అనేక కష్ట నష్టాలను భరించి చేసిన సినిమా. ఈ జర్నీలో ప్రతి ఒక్కరూ తమది భావించి ఈ సినిమాని చేశారు. అనిల్‌రావిపూడి, కోనవెంటక్‌, వెలిగొండ శ్రీనివాస్‌గారు నా వెనుకుండి నడిపించారు. థమన్‌ మరోసారి నాకు ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుందని డెఫనెట్‌గా చెప్పగలను'' అన్నారు.
 
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ మాట్లాడుతూ.. ఐదు పాటలకు ఐదు అందరికీ నచ్చుతాయి. హీరోయిన్స్‌ రకుల్‌, సోనాల్‌ లు పెద్ద హీరోయిన్స్‌ గా పేరు తెచ్చుకుంటారు. మంచి కోస్టార్స్‌, సపోర్టివ్‌. వెలిగొండగారు అందించిన కథను కోనవెంకట్‌, అనిల్‌ రావిపూడి కలిసి మంచి సినిమా వచ్చేలా ప్రిపేర్‌ చేశారు. ఈ పండగ చేస్కో సినిమా చేయడానికి చాలా గ్యాప్‌ తీసుకున్నాను. ఈ గ్యాప్‌ లో మూడు స్క్రిప్ట్స్‌ సిద్ధం చేసుకున్నాను. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌తో మీ ముందుకు వస్తున్నాను. మా పయ్రత్నాన్ని మీరు ఆదరించి ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments