Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్‌ అలా ట్రాక్ తప్పించాడా...? 'గోవిందుడు..'పై గోలగోల

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (18:14 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే'తో అక్టోబర్ 1న వచ్చిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిందనేది సినీ ట్రేడ్ టాక్. 
 
'అత్తారింటికి దారేది' ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది అలా ఉంచితే చిత్ర నిర్మాత బండ్ల గణేష్, గబ్బర్‌ సింగ్‌ విషయంలో తనను మోసం చేశాడని ఓ డిస్ట్రిబ్యూటర్‌ వేసిన కేసు ఇంకా కొలిక్కి రాకముందే.. మరో వివాదంలోకి దిగాడు. తిమ్మినిబమ్మిని చేసే అలవాటున్న ఈయన.. రామ్‌ చరణ్‌ను కూడా ట్రాక్‌ తప్పించాడని టాలీవుడ్ గోల. 
 
ఈ విషయాన్ని రామ్‌ చరణ్‌ కూడా తర్వాత తెలుసుకున్నాడట. కొంతకాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఆరంభమైంది. సినిమా కథ కూడా వినకుండా హీరో ఓపెనింగ్‌కు రావడం.. జరిగిపోయింది. కథ వినకుండానే నేను రానని చెప్పినా.. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన చేసిన ఒత్తిడితో వచ్చాడని తెలిసింది. 
 
ఇంతకీ ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఇకపోతే.. ప్రస్తుతం గోవిందుడు సినిమా.. విడుదలకు బిజినెస్‌ అంతా బాగానే అయిందని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే రీ-షూట్‌ వల్ల ఆయన దాదాపు 5 కోట్లు ఎక్కువే ఖర్చు చేసినట్లు సమాచారం. అది సినిమాకు ఉపయోగమని చెబుతున్నా... సినిమాకు డిఫిషెట్‌ కింద అదే లెక్కగా లెక్కలు చెబుతున్నాయి. మరి కలెక్షన్లు రాబడి ఎంత వసూలు చేస్తే లాభాలు వస్తాయో మరి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments