Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు జంటలతో 'ఎవరికి ఎవరు': గ్రాండ్‌గా ఆడియో రిలీజ్!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:35 IST)
ప్రసన్నాక్షి పిక్చర్స్‌ పతాకంపై ఆర్య, అరుణ్‌, ప్రజ్ఞ, తనిష్క్‌ తివారి నటీనటులుగా కిషోర్‌ వెన్నెలకంటి దర్శకత్వంలో అజయ్‌ హంసాగర్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఎవరికి ఎవరు'. సాయికుమార్‌, నాగేంద్రబాబు, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు.
 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకోని సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. చిన్నికృష్ణ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య ఆడియో  ద్వారా నవంబర్‌ 5న మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెన్నెలకంటి కిషోర్‌ మాట్లాడుతూ... ''ఇదొక యాంటీ పొలిటికల్‌ రెక్టాంగిల్‌ లవ్‌స్టోరీ. ఇప్పటి వరకు ట్రాయంగిల్‌ లవ్‌స్టోరీలు చాలా వచ్చాయి. కానీ ఇది రెక్టాంగిల్‌ లవ్‌స్టోరీ... అంటే రెండు జంటల మధ్య జరుగుతుంది. దీనినే స్వ్కేర్‌ కూడా అనొచ్చు. 
 
ఈ చిత్రంలోని రెండు జంటల్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయికి పెయిరో చెప్పడం అంత సులభం కాదు. ఈ రెక్టాంగిల్‌ లవ్‌స్టోరీలో కీలక పాత్రలు పోషించిన సాయికుమార్‌, నాగబాబు, పోసానిల ట్రయాంగిల్‌ కలిస్తే ఏంటనేది 'ఎవరికి ఎవరు'. వీరి పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్‌గా  ఉంటాయి. 
 
నిజజీవితంలో ఎవరికి ఎవరు అనే పాయింట్‌ తీసుకుని ఈ చిత్రం కొత్త పంథాలో తెరకెక్కించాము. అబ్బాయిలు, అమ్మాయిల అందాన్ని మాత్రమే చూసి ఫాలో అయితే, అమ్మాయిలు మాత్రం అబ్బాయి నడవడిక, క్యారెక్టర్‌, పర్సనాలిటీ చూసి ప్రేమిస్తారు. ఫైనల్‌గా అమ్మాయిలదే కరెక్ట్‌ అని చూపిస్తున్నాము. 
 
అన్ని కమర్షియల్‌ హంగులున్న మా చిత్రంలో చిన్నికృష్ణ అద్భుతమైన అయిదు పాటలను అందించారు. రెండు పాటలను ఎంతో రిచ్‌గా ఉండేలా గ్రాఫిక్స్‌లో చేశాము. చాలా బాగొచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 5న పలువురు సినీ ప్రముఖుల మధ్య ఆడియో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments